Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
భయమింక నీ కొద్దు - నీ వెంట నేనున్నా
నా ప్రాణం నా సర్వం - నీ కోసం అర్పించా
1. లోకమంతయు నిన్ను విడచినా -
బంధు మిత్రులు నిన్ను మరచినా
నీవు నన్ను వదలిన - నేను నిన్ను మరువను -
నేస్తమా మిత్రమా నిన్ను రక్షింతును
2. బాధలందును కీడులందును - తల్లి బిడ్డను మరచిపోవునా
మాతృ మూర్తి మరచినా - నేను నిన్ను మరువను
నేస్తమా మిత్రమా నిన్ను రక్షింతును