Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
భారముచేత అలసి యున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి విశ్రాంతి నిస్తాను
1. వినమ్ర హృదయుడ నేను సాధుశీలుడ నేను
నావలె మీరు ఉంటే చాలు మీదే రాజ్యం అన్నాడు
2. నేనే మార్గం అన్నాడు నేనే జీవం అన్నాడు
సత్యంలోనే నడచిన వారు దేవుని పుత్రులు అన్నాడు
3. ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో
అక్కడ నేను ఉంటానంతే యదార్థమిది అని అన్నాడు
4. విరిగి నలిగిన హృదయముతో ఎవ్వరు ప్రార్థన చేస్తారో
వారి మనవి ఆలకించి వరము లిస్తానన్నాడు