Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. భక్తకోటి స్వరములతో
ఓ బాల యేసువా
భజనలు సేతుమయ్యా
ఓ బాలయేసువా
1. ఆది దేవుడవు నీవే
ఓ బాలయేసువా
ఆరాధన సేతుమయ్యా ||2||
ఓ బాలయేసువా
స్తోత్రమయ్యనీకెప్పుడు ||2||
ఓ బాలయేసువా
స్తుతులు చెల్లించేదం ||2||
ఓ బాలయేసువా
2. శాంతి దూతగా వచ్చిన
ఓ బాలయేసువా
శాంతిని కురిపించుమయ్యా
ఓ బాలయేసువా
సమాధాన కర్తవయ్యా
ఓ బాలయేసువా
సత్యమార్గమందు నడుపు
ఓ బాలయేసువా
3. కీర్తి గల దేవుడవు
ఓ బాలయేసువా
కీర్తనలు పాడెదం
ఓ బాలయేసువా
కరుణ మాకు చూపుమయ్యా
ఓ బాలయేసువా
కరములెత్తి మొక్కెదం
ఓ బాలయేసువా
4. మహిమ గల దేవుడవు
ఓ బాలయేసువా
మహిలో జన్మించిన
ఓ బాలయేసువా
దేవుని ప్రియపుత్రుడవు
ఓ బాలయేసువా
దేవరాజ్యమియ్యవయ్యా
ఓ బాలయేసువా
5. శిశువుగ పుట్టితివి
ఓ బాలయేసువా
పశువుల గాటిలో
ఓ బాలయేసువా
ఆశలు తీర్చెడి
ఓ బాల యేసువా
అండగా నుండుమయ్య
ఓ బాలయేసువా
6. కన్యకు పుట్టిన కర్తవే
ఓ బాలయేసువా
కరుణ హృదయుడవే
ఓ బాలయేసువా
కలుషము బాపుమయ్య
ఓ బాలయేసువా
కనుదమయ్య నిన్నును
ఓ బాలయేసువా
7. జీవ జలమునీయుము
ఓ బాలయేసువా
జీవమిచ్చి కావుమయ్య
ఓ బాలయేసువా
జీవపు రొట్టెపు
ఓ బాలయేసువా
జేజేలు పాడెదం
ఓ బాలయేసువా
8. మంచి కాపరివయ్యా
ఓ బాలయేసువా
మమ్మును మేపుమయ్యా
ఓ బాలయేసునా
సాత్విక హృదయుడవు
ఓ బాలయేసువా
సహనమిచ్చి బ్రోవుమయ్యా
ఓ బాలయేసువా
9. అద్భుత కారుడవు
ఓ బాలయేసువా
ఆదుకోమమ్మునెల్ల
ఓ బాలయేసువా
అమలోద్భవి పుత్రుడవు
ఓ బాలయేసువా
అంజలిని స్వీకరించు
ఓ బాలయేసువా
10. శక్తిగల దేవుడవు
ఓ బాలయేసువా
ముక్తి మాకు చూపుమయ్యా
ఓ బాలయేసువా
నేనే మార్గమన్నట్టి
ఓ బాలయేసువా
నేను నిన్ను అనుసరించు
ఓ బాలయేసువా
11. నేనే సత్యమంటివి
ఓ బాలయేసువా
సత్యమందు నన్ను నడుపు
ఓ బాలయేసువా
సకలము నీవయ్యా
ఓ బాలయేసువా
సాగు నీదు రాజ్యము
ఓ బాలయేసువా
12. శరణమైయున్నట్టి
ఓ బాలయేసువా
నీవు మాకు శరణమయ్యా
ఓ బాలయేసువా
అందుకో మా ప్రణతులు
ఓ బాలయేసువా
అందరిని కావుమయ్యా
ఓ బాలయేసువా!