Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
బెత్లహేము నగరిలో పూరిపాక నీడలో-
పాపనవ్వు విరిసెను - పాపి గుండె కరిగెను
1. కన్యమరియ కన్న తల్లిరా -
ఎన్నటికి మరువరాని కల్పవల్లిరా
లాలి లాలి లాలని యేసు బాల జోలని-
లోకమంతా ఊయలగా ఊపినట్టి దేవతరా
లాలిజో....జో.... లాలిజో.....
2. లేమి యింట ఉన్న వాడుగా వెలసినావు
జగతిలోన ప్రేమ మీరగ
నీవు లేని హృదయము ఏమిలేని సదనము
ఏమి సుఖము పొందుటకు పుట్టినావు గడ్డిలో
లాలిజో.... జో.... లాలిజో....
3. పల్లెలోని గొల్లవారలు వెల్లిరిగా ప్రభుని చూడ తెల్లవారగ
మంచి గొట్టెలకాపరి మనకు వెలుగునిచ్చురా
మందలన్ని మేపుటకై కన్య మరియ కన్నదిరా
లాలిజో....జో.... లాలిజో.