Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
భోజ్యమౌ భోజ్యమా - యేసుప్రభుని దేహమా
పానమౌ పానమా - క్రీస్తు ప్రభుని రక్తమా
ప్రేమమయ ఐక్యమౌ - నాలోని నాకోసం
జీవింతును నీ కోసం - నిరతము నీ సేవలో
1 వ చరణం..
నీ మాటలు మీరిన - ఇజ్రయేలు ప్రజలను
మేలైన గోధుమలతో - పోషించిన దేవా
నీ మార్గం ఎడబాసిన - ఈ నీధు బిడ్డలను
కొండ తేనెతో సంతృప్తిలు - చేసిన సర్వోన్నత
ప్రేమమయా నీ ప్రేమను (ఎలా ఎలా నేగాంచును) ||2||
2 వ చరణం..
ఆపదలు అలజడలు నన్ను ముంచెత్తగా
నీరాక నా హృదిలో - ప్రశాంతతను ఇవ్వగా
కోటి కోటి స్తోత్రములతో - నిను భజింతు దేవా
నీ తలపులు నాకు - మిగులు ప్రీతిదేవా
ప్రేమమయా నీ ప్రేమను (ఎలా ఎలా నేగాంచను) ||2||