Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. దేవా అందుకొనుమా - నాదు జీవంబును
చేర్చితి దేవా నాకున్న దంతయు
ఏకముగా ముదమార స్వీకరించు ||దే||
1. ఫలమైన పువ్వైన నీ సృష్టేగా
ఘనమైన ధనమైన నీ కరుణేగా
ఏమైన ఏదైనా నీ వల్లేగా
ఏమివ్వ గలవాడ నాదన్నది
ఈ జీవితం నేడు సమర్పింతును
దయతోడ గైకొనుమా-దేవా-కొనుమా ||దే||
2. కరుణించి కాపాడు ప్రభు నీవేగా
కలతయిన నలతయిన బాపెదవు
నాకున్నదంతయు నీవల్లనే
నిను నమ్మి చేరితి నీ చెంతకు
నా మార్గమే నేడు నీ కంకితం
దరిచేర్చ దయనిడుమా
దేవా-దయనిడుమా ||దే||