Type Here to Get Search Results !

దేవా నా హృదయార్పణం ( Deva na hrudhayarchanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దేవా నా హృదయార్పణం

నీకే దేవా నేనర్పింతును 

నాదన్న ప్రతి అణువు నీదే కదా 

నేనేమర్పించిన అది నీదే కదా ||2|| ||దేవా|| 


1. ఏ సిరి సంపదలు నీకిచ్చినా 

నీ ప్రేమకు సరిపోవునా 

వేలాది బలులను అర్పించినా 

నీ త్యాగం సమసిపోవునా 

నా ప్రాణం నా సర్వం అర్పించినా 

నీ జాలి కరుణతో వెలకట్టునా ||2|| 

ఆ కలువరి సిలువలో-నీ ప్రాణ అర్పణకై

నేనేమి ఇచ్చినా-సరిపోవునా ||2|| ||దేవా|| 


2. నా మనసును అర్పింతును

నీ సేవలో తరియింతును 

నా ప్రభువా స్వీకరించుమా 

కరుణతో నా ప్రార్ధన 

పేదరాలి కానుకే నీ కెంతో ప్రియమాయే 

నీ ప్రేమతో దర్శించినావా 

ఆబేలుని అర్పణ నీకెంతో ప్రియమాయే 

నీ కరుణతో స్పర్శించినావా 

ఆ అర్పణతో మమ్ము-ఏకం చేసి 

అంగీకర యోగ్యముగా మలచుమయ్యా ||2|| ||దేవా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section