Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప దేవా నా జీవితం నీ కోసమే అర్పింతును
దేవా నా సమస్తము
నీకోసమే సమర్పింతును ||2||
నా జీవనాధా ఓ దేవ దేవా!
నీకే నా సర్వమును అర్పింతును ||2||
1. నీ విచ్చిన నా చేతులతో
నీ పాదపూజలే చేసెదనయ్యా
నీ వొసగిన నా కన్నులతో నిన్ను
గాంచి తరియింతునయ్యా ||2||
నీవిచ్చిన ఈ పెదవులతో ||2||
నిరతము నీ నామము నే
జపింతును ||2||
2. నీ విచ్చిన నా మనస్సుతో
నీ ప్రేమను పంచెదనయ్యా
నీ విచ్చిన నా స్వరముతో
నీ కీర్తనలే పాడెదనయ్యా ||2||
నీ విచ్చిన ఈ పాదాలతో ||2||
నిను వెంబడింతును నా యేసయ్యా ||2|| ||దే||