Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవా...... నా ప్రభువా...... ఆలించు మా ప్రార్థన
నీ... పాద సన్నిధి చేరితిమి....
నీ వాక్యవిందుకై వేచియుంటిమి ||2||
మాట్లాడే దేవా మాతో మాట్లాడుమయా
మాట్లాడి మార్గమును నేర్పించుమయా
1 వ చరణం..
ఈ రోజు మేమంత గుమిగూడి ఉండగ
నీ ఆత్మను మాపైన క్రుమ్మరించుమా ||2||
ఇజ్రయేలు ప్రజలను నడిపించిన రీతి ||2||
నీ హస్త నీడలో మము నడుపుమయా ||2|| llమాట్లాll
2 వ చరణం..
నీ దివ్య మార్గములో స్థిరముగ పయనించ
నీ వాక్యమునందు మమ్ము ప్రతిష్టించుమా ||2||
నీ ప్రేమ పలుకును శ్రద్ధగా ధ్యానించ ||2||
మా జ్ఞాన నేత్రములను తెరువుమయా ||2|| llమాట్లాll