Type Here to Get Search Results !

దేవా నాలో నిర్మల హృదిని ( deva nalo nirmala hrudhini Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దేవా నాలో నిర్మల హృదిని సృజియింపుము 

దేవా నాలో స్థిరమైన మనస్సును కలిగించుము ||2||


నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకయ్యా ||2||

నీ ఆత్మను నా నుండి తీసివేయకయ్యా ||2||

యేసయ్యా నా యేసయ్యా ` ఈ పాపి మనసును మార్చుమయ్యా ||2|| 


1 వ చరణం.. 

తల్లి గర్భమందే నేను కిల్బిషాత్ముడను 

పుట్టినప్పటి నుండియే పాపాత్ముడను ||2||

నా మనసును నీ జ్ఞానముతో నింపుము 

హిస్సోపుతో నాలో పాపం కడుగుము ||2||

హిమముకంటే తెల్లగా నన్ను మార్చుము 

నీ రక్షణానందమును నాకు ఒసగుము ||2|| llదేవా నాలోll 


2 వ చరణం.. 

విరిగి నలిగిన మనస్సుతో నిను చేరితిని 

పశ్చాత్తాపము నొంది ప్రార్థించితిని ||2||

నా దురితమున్నియు మన్నింపుము 

హిస్సోపుతో నాలో పాపం కడుగుము ||2||

హిమముకంటే తెల్లగా నన్ను మార్చుము 

నీ రక్షణానందమును నాకు ఒసగుము ||2||llదేవా నాలోll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section