Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నా ప్రాణనాధుడా
ప. దేవా నీ కృప చూపవా ..
నీ దయ నాకు ఒసగుమ ||2||
పాపపు కూపంలో పడియున్నాను ||2||
కరుణను చూపి లేపవా ||2|| ||దే||
1. పొరుగు వారిని దూషించితిని
వారి మనసులను గాయపరచితిని ||2||
నీ వాక్యాన్ని పాటించకుంటిని ||2||
చెడు మార్గములో నడచితిని ||2|| ||దే|| '
2. స్నేహితులను మోసం చేసితిని.
ప్రేమించిన వారిని ద్వేషించితిని ||2||
అయిన వాళ్ళను దూరం చేసితిని ||2||
నీ మార్గమును విడిచితిని ||2|| ||దే||