Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవా నీ ప్రేమనే మరిచాను నీ మాటకాదన్నాను ||2||
నీ నీతి కాదని నీ ఆజ్ఞ నాకేలని జీవచ్ఛవమై బ్రతికాను
సత్యము కాదని ధర్మము వద్దని పాపాత్ముడనై తిరిగాను
కోరస్:
ఈ దినము... నీ ప్రేమ కనుగొంటిని దేవా...
క్షమ పాలించుమో ప్రభువా...
కరుణా హృదయుడ నా ప్రభువా
నీ కృప చాలునో దేవా!
నీ కృప చాలును నా దేవా llదేవాll
1 వ చరణం..
ప్రేమగల నా యేసు పచ్చని లోయలలో
విశ్రమింప చేయుచుండగా...
కృపగల నా క్రీస్తు
స్వచ్ఛమైన నది చెంతకునను
నడిపించుచుండగా...
నీ చేయి విడిచాను నా దారి కోరాను ||2||
ఒంటరినై.....నే మిగిలాను ...... llఈదినముll
2 వ చరణం..
ప్రభునే స్తుతియిస్తూ కృపనే స్మరియిస్తూ
నా నావ సాగుచుండగా....
ఆత్మ తండ్రి ఫలములగా
విజ్ఞాన సంపదలను
స్థిరముగా పొందుచుండగా
పుడమే అందమని నీ కృప మరిచాను ||2||
అజ్ఞానునిగా..... మిగిలి పోయాను..... llఈ దినముll