Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవా నీ అనుభూతి
ఈ దేవళమున దొరుకును ||2||
దేవా నీ అనుభూతి మదిలోన మెదులును
దేవా నీ అనుభూతి హృదయాన్ని తాకును
1. క్రీస్తు తానే ఆలయమనుచు
యెరుషలేమున పలికెను
క్రైస్తవుడే ఆత్మాలయమనుచు
శ్రీ భక్తపౌలు తెలిపెను
ఆకాశమే నా ఆసనమనుచు
పలికినట్టి ప్రభుడవు
భూమియే నీ పాద పీఠమని
తెలిపినట్టి దేవుడవు
ఏల కట్టెద ప్రభువా నీకు దేవళం ||2||
ఎటుల నిర్మింతు దేవా నీకు ఆలయం ||దే||
2. ఆన్యులతో వేయినాళ్లు
నివసించుట అనర్థము ||2||
ప్రభు నీ మందిరమున ఉండు వారు ధన్యులు
దుష్ట జనుల గృహములందు
నిలుచుండుట శాపము
నీ నివాస స్థలమున
ఒక దినముండుట శ్రేష్టము
ఏల కట్టెద ప్రభువా నీకు దేవళం ||2||
ఎటుల నిర్మింతు దేవా నీకు ఆలయం ||దే||
3. యుద్ధ ప్రియుడు దావీదు రాజుని
రక్త సిక్తకరములు యావే ప్రభువునకు
ఆ చేతులెంతో హేయమైన హస్తములు
ఆలయ నిర్మాణము కవి అపవిత్రములని
ప్రభుని వాక్కు తెలిపెను .
మహాజ్ఞాని సొలోమోను
ఆలయనిర్మాణ వరమొందెను
ఏల కట్టెద ప్రభువా నీకు దేవళం ||2||
ఎటుల నిర్మింతు దేవా నీకు ఆలయం ||దే||