Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి
దేవా...... నీ పాద పూజకు
నా తనువు మనసు
ఏకమై వచ్చాను స్వామి
హృదయాంజలితో
నిలిచాను స్వామి ||2|| దే||
1 వ చరణం..
సుధ చిందే పలుకులు వినగ
ఎదపొంగి నీ నిలయముకు
నీ సేవలో ధన్యత నొందగా
స్వరము స్వరము ఏకమై ||2||
నీ స్తుతి గానము చేయుచూ ||దే||
2 వ చరణం..
నీ చల్లని పిలుపును వినగ
నీ సన్నిధి నిలచిత్తి స్వామి ||2||
నీ ప్రేమలో ఓలలాడగ
పదము పదము ఏకమై ||2||
నీ స్తుతి గానము చేయుచూ ||దే||