Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
దివ్యమూర్తి యేసు క్రీస్తునే - మానవాళి ముక్తి దాతగా
లోకజ్యోతి యేసు దేవునే - అంజలింప తరలి పోదమా
1 వ చరణం..
ఆరని ఓ దీపమా - జీవమిచ్చు దైవమా !
చీకటిని పారద్రోలి – వెలుగును విరజిమ్ముమా !
నిన్నె కీర్తింతును నిన్నె పూజింతును
జ్ఞాన జ్యోతి మాలో నిలుపుమా ||2||
llదివ్యll
2 వ చరణం..
ఆదియందు వాక్యమా - పుడమిపైన ధర్మమా
సృజనాత్మక శక్తి నొసగు త్రీత్వేక దైవమా !
మాలో వేంచేయుమా - మా బ్రతుకు మార్చుమా
నీతి మార్గమందు మమ్ము నడుపుమా ||2||
llదివ్యll