Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: దేవా! నీకే వందనం నా జీవన నాయకా వందనం
నీ కనుసన్నల కావుమయా నీ కరమిచ్చి బ్రోవుమయా
1. అనుదినము, అనుక్షణము, నీ పిలుపును నామది నిలిపి
అహరహము నేనందరికి నీ పలుకులను నే వినిపించి
అందరికి.... అమృత ప్రేమ... అనవరతము నే నందింప
అందరికి నీ అమృత ప్రేమ అనవరతము నే నందింప
దేవా... ప్రభువా!.... నీ సేవకు పిలచితి దేవా ||దేవా ||
2. అపజయము, అవమానము, నేనెల్లపుడు లెక్కింపక
అక్షయము బహు అతిశయమౌ నీ జ్ఞానముతో నే నింపబడ
అల్పులకు.... హీనులకు... అండదండగ నేనుండ ||2||
దేవా! ... ప్రభువా... నీ సేవకు పిలిచితి నీవే ||దేవా ||