Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. దేవమాతను వేడరా జన్మ సార్థక మందురా
పాడు జన్మకు ఇంతకంటే పరమ మార్గము లేదురా
1. దేవదేవుని దీవెనలలో యేసు నాధుని
కనియెరా కన్యయై గర్భము ధరించిన
పరమ పావన సాధ్విరా ||దే||
2. పంతొమ్మిదవ శతాబ్దమున
పరమ పావనమైన తండ్రి
దేవమాతకు జన్మ పాపము
లేదు లేదని తెలిపెరా ||దే||
3. ఫ్రాన్సు దేశపు లూర్థుగుహలో
బీదరాలగు బెర్నదత్తుకు
మోదమలరగ దర్శనములో
మోదముతోనిటు పల్కెరా ||దే||
4. జన్మపాపములేక నేను
జననమొందినదానను
ఈ సువార్తను లోకమంతట
చాటిచెప్పగా కదలిరా ||దే||
5. పాపు లెల్లరు పరుగు తోచని
లూర్థుమాతను వేడిన
పాపాలన్నీ పార ద్రోలి
పరమ పదవికి జేర్చురా ||దే||