Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
నిన్ను నన్ను ధరలో ప్రతివారిని
ఎంతో ప్రేమించెను - ప్రేమించి ఏతెంచెను
1. పరలోక ప్రేమ ఈ ధరలో
ప్రత్యక్షమాయే ప్రతివానికై ||2||
ఆదియందున్న ఆ దేవుడు
ఏతెంచె నరుడై ఈ భువికి ||2||
ఈవిందు ఇలలోన అందించే
యేసు నీకొరకే ||దే||
2. పాపాంధకారములో అంధులుగా
చీకటి లోవలో తిరుగాడగ ||2||
జీవపు వెలుగైన ఆ ప్రభువు
వెలింగించ వచ్చెను ప్రతివారిని ||2||
ఈ వెలుగు నీకొరకై
ఏసు నిన్నిల వెలుగించును ||దే||