Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 9
సా: దేవుని ఉద్యానవనమున పెరిగే జీవవృక్ష ఫలము నీవయ్యా - మా యేసయ్యా ప: దేవుని ఉద్యానవనమున పెరిగే
జీవవృక్షఫలము నీవయ్యా
జీవవృక్షఫలము నీ సత్ప్రసాద మై
ఇలవెలసినదయ్యా
ఆ జీవ వృక్ష ఫలమును భుజించు
అర్హతమాకు ఇచ్చిన యేసయ్యా
వందనం వందనం దివ్య సత్ప్రసాద ప్రభువా
వందనం ||4|| ||దేవుని ||
1. పరము వీడి భువికి వచ్చి
మా పాపములన్ని పరిహరించిన దేవా
ఏ అర్హత లేనట్టి మా లోనికి ||2||
సత్ప్రసాదమై వేంచేసితివా||2||
వందనం వందనం దివ్య సత్ప్రసాద ప్రభువా
వందనం ||4|| ||దేవుని ||
2. గొర్రేపిల్లె చంపబడిన
మా పితయగు దేవుని ప్రియసుతుడైన దేవా
వాడిపోతున్న మనుజాళి ఆశలను ||2||
దివ్యభోజ్యముతో చిగురించితివా ||2||
వందనం వందనం దివ్య సత్ప్రసాద ప్రభువా
వందనం ||4|| ||దేవుని ||