Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ద్రాక్షావల్లి
ద్రాక్షావల్లిలో తీగెలవోలె -
తనలో మనము నిలవాలని
మనలో తాను కొలువై ఉండాలని
పిలిచెను తన శరీర రక్త విందుకు
1. పాస్కాబలి విందు సంపూర్తి ప్రసాద క్రీస్తు-
మన్నా భోజన పరిపూర్తి ప్రసాద క్రీస్తు
మము పోషించు ప్రసాద ప్రభువుకు జేజేలు-
మాలో ఫలించు ద్రాక్షావల్లికి జేజేలు
2. కన్య మరియ గర్భఫలం ప్రసాద క్రీస్తు-
కడరా భోజన జ్ఞాపకార్థం ప్రసాద క్రీస్తు
మము పాలించు మంచి కాపరికి జేజేలు-
మాలో వెలుగొందు నీతిసూర్యునికి జేజేలు