Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవుని ఆజ్ఞను పాటించువారు జీవింతురూ జీవింతురు
యేసుని వాక్కును చాటినవారు సేవకులూ సాక్షులు
అల్లెలూయ పిత - అల్లెలూయ సుత -
అల్లెలూయ ఆత్మ అల్లెలూయ
1. దీన మనస్కులు ధన్యులు దేవుని రాజ్యం వారిది
దుఃఖితులెల్లరు ధన్యులు ఓదార్చ బడుదురు నిత్యము
2. వినమ్రులెల్లరు ధన్యులు భూమికి వారు వారసులు
నీతి పరులు ధన్యులు సంతృప్తి వారు పొందును
3. దయగలవారు ధన్యులు దయగల మకుటం వారిది
నిర్మల హృదయులు ధన్యులు దేవుని సదా దర్శింతురు
4. శాంతి నిర్మాతలు ధన్యులు దేవుని పుత్రులుగా నుందురు
వేద హింసితులు ధన్యులు దేవుని రాజ్యం వారిది