Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవుని ఆత్మరా అభిషేక ఆత్మరా
నడిపించు నన్ను ప్రభు యేసు దరికి
పరిశుద్ధ ఆత్మరా ||2||
1 వ చరణం..
చురుకైన ఆత్మ స్థిరమైన ఆత్మ
బలపరచు ఆత్మ స్థిరపరచు ఆత్మ
వశియించు నాలోన ||2||
నిగ్రహ ఆతనమ్మదగిన ఆత్మ
జరిగించు క్రియ నాలోన.. ||2|| llదేవునిll
2 వ చరణం..
దైవ భీతి దైవజ్ఞానం కలిగించు నాలో తండ్రీ ఆత్మ ||2||
సూక్ష్మమైన ఆత్మ స్పష్టమైన ఆత్మ
విజ్ఞానపు ఆత్మ విశ్వాసపు ఆత్మ ||2||
వసియించు నాలోన....
ప్రవచన ఆత్మస్వస్థ పరచు ఆత్మ
జరిగించు క్రియ నాలోన.... ||2|| llదేవునిll
3 వ చరణం..
భాషలలో కీర్తింప భాషలను వివరింప
కృపనీయు నాకు క్రీస్తుని ఆత్మ ||2||
విజ్ఞాపన ఆత్మ కరుణించు ఆత్మ
ప్రేమనిచ్చు ఆత్మవివేచించు ఆత్మ ||2||
వసియించు నాలోన....
రహస్యములనుబయుల పరచు ఆత్మ-
జరిగించు క్రియ నాలోన.. ll2। llదేవుని||