Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవుని ప్రజలారా - పూజలో పాల్గొనరే
త్యాగము రాగము సంగమ యాగములో
ధ్యానము గానము రంజిత మోదముతో
1. వేదము మోదము జీవన నాదముగా -
భావన ప్రేరణ పావన దీవెనగా
ఎద ఎదలో ఉదయించి - మది మదినీ కదిలించే
కారణ జన్మము ధన్యము చెందెనుగా
2. వేదన శోధన జీవన యానములో -
ఏదరి చేరని జీవన వారధిలో
ఆశ్రయమై సదాశయమై ఆదరమై సమాదరమై -
ఆశ్రిత జీవుల ఆర్తిని తీర్చునుగా