Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు
దేవుని స్తుతియించుడి, ఆ..ఆ..ఆ....ఆ...
1. ఆయన బలమును ప్రసిద్ది చేయ
ఆకాశ విశాలమందు ఆ...ఆ....ఆ...ఆ...
2. ఆయన పరాక్రమ కార్యము బట్టి
ఆయన ప్రభావమును ఆ...ఆ...ఆ...ఆ...
3. బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి.
స్వర మండలములతో ఆ...ఆ...ఆ...ఆ...
4. సన్న తంతుల సితారతోను
చక్కని స్వరములతో ఆ...ఆ...ఆ...ఆ...
5. పిల్లన గ్రోవిని చల్లగ నూది
ఎల్ల ప్రజలు జేరి ఆ...ఆ...ఆ...ఆ...
6. తంబురతోను నాట్యముతోను
తంతి వాద్యముతోను ఆ...ఆ...ఆ...ఆ...
7. మ్రోగు తాళముతో ఆయనన్ స్తుతించుడి.
గంభీర తాళముతో ఆ...ఆ...ఆ...ఆ...
8. సకల ప్రాణులు దేవుని స్తుతించుడి.
అల్లెలూయ ఆమెన్.ఆ...ఆ..ఆ....