Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవుని స్వరము-సుమధుర స్వరము
సర్వసృష్టికారకం
అమరుని స్వరము-అమృత స్వరము
పరమ సిద్ధి దాయకం ||2||
విశ్వాసం కలిగిన చోట
ప్రభుని స్వరం వినిపిస్తుంది
విశ్వసించి అడిగిన క్షణమే
అభయ హస్తమందిస్తుంది ||2|| ||దేవుని||
1. అవరోధాలెన్నున్నా బెదిరిపోకు నేస్తమా
కష్టాల కడలిని చీల్చి నడిపించునులే
ఇసుక దారులెదురైనా దిగులుపడకు నేస్తమా
పరమునుండి మన్నా కురిసి పోషించునులే ||2||
చీకటి దారిని వెలుగును చూసి
ముందుకు నడిపింది
పితరుల చరితం ఇందుకు
సాక్ష్యం ముందే పలికింది ||2||
తెలుసుకుంటే సత్యమిది
పరము చేర్చు మార్గమిది ||2|| ||దేవుని||
2. శోధనలెన్నెదురైనా చెదరిపోకు నేస్తమా
సర్వేశుని మనమున తలచి పోరాడుమా
ఆవేదనలెదురైనా కలత పడకు నేస్తమా
సిలువ ధారి ప్రభువును చేరి ప్రార్థించుమా ||2||
బండలనుండి జలములనిచ్చిన
బలవంతుడు ప్రభువు
జీవము పోసి మృతులను లేపిన
మహిమాన్వితుడతడు ||2||
తెలుసుకుంటే సత్యమిది
నిత్యజీవ సారమిది ||2|| ||దేవుని||