Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: దేవునికి స్తోత్రము గానము
చేయుటయే మంచిది
మనమందరము స్తుతి గానము
చేయుటయే మంచిది ||2||
1. యెరుషలేము యెహోవాయే
కట్టుచున్నవాడని ||2||
ఇశ్రాయేలీయులను
పోగు చేయువాడని ||దే||
2. గుండె చెదిరిన వారిని
బాగు చేయువాడని
వారి గాయములన్నియు
కట్టుచున్నవాడని ||దే||
3. నక్షత్రముల సంఖ్యను
ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు
పెట్టుచున్న వాడని ||దే||
4. ప్రభువు గొప్ప వాడును
అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే
మితియులేని వాడని ||దే||
5. దీనులకు అండాయనే
భక్తిహీనుల గూల్చును
సితారతో దేవుని
స్తుతులతో కీర్తించుడి ||దే||
6. పర్వతములలో గడ్డిని
పశువులకు మొలిపించెను
అరచు-పిల్ల కాకులకును
ఆహారము తానీయును ||దే||