Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవుని వాక్యము దివ్య వాక్యము -
ప్రభుని వాక్యము ప్రేమ వాక్యము
జీవ ఫలములు మనకిచ్చును -
జీవనాథుని ఈ వాక్యము
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ ||2||
1. వాడియైన రెండంచుల ఖడ్గధారి ప్రభువాక్యము
అగ్ని జ్వాలల కాంతిని ఇచ్చును -
వెలుగు దారి ప్రభు వాక్యము
శ్రద్ధగా ఆలింపుము కృతజులై జీవింపుము ||అల్లెలూయ||
2. హృదయ ఫలకము పై రాసిన
దైవ సుతుని ప్రియ వాక్యము
దివ్యలోకపు దరికి చేర్చెడి
దివ్య ద్వారము ప్రభువాక్యము
శ్రద్ధగా ఆలింపుము కృతజులై జీవింపుము ||అల్లెలూయ||