Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నినిస నినిస నినిస దనిదసగ
పమగ నిపమ సనిప పనిరీగస
దివ్య రాగాలతో వినుతింతును
నవ్య భావాలతో సమర్పింతును
గోధుమ అప్పములను ద్రాక్షారసములను
ప్రేమ, కానుకలను ధన ధాన్యములన్
చేకొనుము స్వామీ దీవించుము ||2|| ||దివ్య రాగాలతో||
సగమపగరిస సగమనిదా
1. మనసారా నిన్ను నేను కోరుకొంటిని
తొలి ఫలములను కొని తెచ్చితిని
ఆబేలుని మనసునెంచి
నాణ్యమైన వాటిని ||2||
అర్పింతును గైకొనుము ||2||
ఆశీర్వదించుము ||దివ్య రాగాలతో||
2. కొండంత ఆశతో నిన్ను చేరితిని
నే తెచ్చిన కానుకను స్వీకరించుము
విధవరాలి దీనమనసు ఎరిగి నేను ||2||
అర్పింతును గైకొనుము ||2||
ఆశీర్వదించుము ||దివ్య రాగాలతో||