Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
దేవుని యందు నిరీక్షణ యుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా
1 వ చరణం..
ఏ అపాయము రాకుండ నిన్ను
దివారాత్రలు కాపాడుతాడు
ప్రతిక్షణం ` నీ పక్షముండు`రక్షకుడు llదేవునిll
2 వ చరణం..
చీకటిని వెలుగుగా చేసి`ఆయనే నీ ముందు పోవువాడు
సత్యమగు`జీవమగు మార్గమేనే llదేవునిll
3 వ చరణం..
నీకు సహాయము చేయువాడు
సదా ఆదుకొనువాడు ఆయనే
ఆధారము ఆదరణ ఆయనలో llదేవునిll
4 వ చరణం..
తల్లి తన బిడ్డను మరచినను
మరువడు నీ దేవుడు నిన్ను
తల్లి కన్న తండ్రికన్న ఉత్తముడు llదేవునిll
5వ చరణం..
నీకు విరోధముగా రూపించిన
ఏ విధ ఆయుధమును వర్దిల్లదు
శత్రువు మిత్రుగా మారుదురు llదేవునిll
6వ చరణం..
పర్వతములు తొలగిపోయినను
తన కృప నిన్ను ఎన్నడు వీడదు
కనికర సంపన్నుడు నా దేవుడు llదేవునిll
7వ చరణం..
స్తుతి మహిమలు నీకే ప్రభు
నిత్యము నిన్నే కొనియాడెదను
అల్లేలూయా ` అల్లేలూయా ` అల్లెలూయా llదేవునిll