Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివికి భువికి పర్వదినం
శ్రీ యేసుని జన్మదినం ||4||
దివిభువి వారధిగా-జగతికి సారధిగా ||2||
దేవుడే మానవుడై జన్మించగా ||2||
ఆనందమే పరమానందమే .
లోకమంతా ఆనందమే ||2||
Happy Happy Christmas Christmas
Merry Merry Christmas Christmas
Happy Happy Christmas
Merry Merry Christmas ||2||
1. దావీదు వంశాన-కన్యమరియ గర్భాన
యూదయా రాజ్యాన-బెత్లెహేమున ||2||
పశువుల పాకలో-పుట్టెను బాలుడై
లోక రక్షకుడు-పరమ దేవుడు ||2||
ఆనందమే పరమానందమే
లోకమంతా ఆనందమే ||2||
||Happy Happy Christmas||
2. పీడిత జనులకు ప్రియబాంధవుడై
బాధిత ప్రజలకు విముక్తి దాతయై ||2||
చీకటి బ్రతుకులకు-వెలిగే దీపమై
ఉదయించెను ప్రభు-మనుజరూపుడై ||2||
ఆనందమే పరమానందమే
లోకమంతా ఆనందమే ||2||
||Happy Happy Christmas|| ||దివికి భువికి||