Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివ్యకాంతి వెలిగే వేళ ప్రభుని రాకడ యీ వేళ
మానవత్వం పరిమళించే యీవేళ
ఏసుజననం మనకు శుభవేళ -
లాలమ్మ లాలి బాలయేసు లాలి
1. తల్లినోట పలికింది లాలినవ్వు -
బోసినోట విరిసింది చిరునవ్వు
దూతలంత పాడిరి మహిమగీతం -
లోకమంత చాటిరి యేసు జననం
2. రాజులెంట తెచ్చిరి కానుకలు -
ప్రభుని ముంగిట అర్పించిరి భక్తితోడ
గొల్లలంత ఏకమై ప్రభుని కొలువ -
దేవుడే తనయు చూచి సంతసించే