Type Here to Get Search Results !

దివ్యబాలయేసుకు - నవ్య గీతం ( divyabalayeauku - navya geetham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దివ్యబాలయేసుకు - నవ్య గీతం పాడండి 

భవ్యదివ్య నాధుని - శరణువేడగ రారండి 

రసరమ్య రాగాలతో 

స్తుతి స్తోత్రగానాలతో ||2|| 

సంకీర్తన చేయుదాం 

ప్రణమిల్లి పూజించుదాం ||2|| 

||దివ్యబాల|| 


1. లోకమునెంతో ప్రేమించి 

మానవ రక్షణ గావించి 

మరియ సుతునిగా జన్మించి - 

దైవరాజ్యమును స్థాపించి 

నీదు ప్రేమను చూపినావు - 

నీదు మమతను పంచినావు ||2|| 

కరుణతో మముకావుమయ్యా - 

నీదు శాంతిని ఒసగుమయా 

||రసరమ్య|| ||దివ్యబాల|| 


2. నీ నామమునే స్మరియించి - 

నీ సన్నిధికి ఏతెంచి 

వెలుగు సుతులుగ జీవించ - 

నీదు హస్తముతో దీవించు 

నిన్ను ఆరాధించువారిని ఆదరించే 

విభుడవు నీవు ||2|| 

కరుణతో మము కావుమయ్యా 

నీదు శాంతిని ఒసగుమయా 

||రసరమ్య|| ||దివ్యబాల|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section