Type Here to Get Search Results !

దాహము గొన్న వారలారా ( dhahamu gona varalara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దాహము గొన్న వారలారా

దాహము తీర్చు కొనండి

దేవుడేసె జీవ జలము

త్రాగ రారండి.... అల్లేలూయా


జీవజలము శ్రీ యేసు క్రీస్తు

జీవపు ఊటలు ప్రవహింప జేయు

జలమును పొంది జీవము నొంద

జలనిధి చేర రండి ll అల్లేలూయా ll 


నేనిచ్చు నీళ్ళు త్రాగెడి వాడు

ఎన్నటికైనా దాహము గొనడు

అని సెలవిచ్చిన ఏసు ప్రభుని

చెంతకు చేర రండిll అల్లేలూయా ll 


తన పాపమును ఎరిగినవాడు

తండ్రి క్షమాపణ నొందినవాడు

తప్పక నొందును జీవజలము

త్వరపడి వేగ రండిll అల్లేలూయా ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section