Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. ధరణిపైన వెలసిన దైవ మందిరమున
హృదయార్పణ చేయగ అరుదెంచితి ||2||
ముదమార స్తుతులు పాడి-కానుకలర్పించు ||2||
పరమ తండ్రి చెంతచేరి పరవశించితి ||2||
1. భవసాగరాన బ్రతుకు
నావను నడిపించువాడు
అజ్ఞాన తిమిరాన
వెలుగును ప్రసరించువాడు ||2||
శోధన ఆవేదనలో
స్వాంతన కలిగించువాడు ||2||
పరలోక నాధుడు
నా ప్రియ బాంధవుడు ||2||
2. బేధ భావములన్ని మదినుండి తొలగించి
పరితాప హృదయునై ఆత్మశుద్ధి నొందితి ||2||
పొరుగువారి సేవలో
ప్రేమపూలు పూయించి ||2||
ప్రియమార అర్పించగ అరుదెంచితి ||2||