Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి : ధవళ సింహాసనమునకు `
అధిపతియైన సర్వేశ్వరా
పితా పుత్ర పవిత్రాత్మ అనుబంధమా
అందుకొనుమా మాదు ప్రణతులు
నీకివే మా ప్రణతులు ||2||
ప్రణతులు ప్రణతులు ప్రణతులు
ససని దని గమపా మపమగ ` సరిగమ మద దదసా సదా మపా
పల్లవి:
నిను చేరగ నిను కీర్తించగా....
నా హృదయం పద్మమువలె వికసించిపోగా ||2||
సదా నీ పూజలో నేలీనమవ్వగా ||2||
దరిశన మీయవా దీవెనలిడుమా ||2|| llనినుll
1 వ చరణం..
గగ గరిమ దద దనిసా
పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూప మిదియే
ప్రేమ మీర ప్రియపుత్రుని బలియాగ మిదియే
గగ గపా పప పదసా
పీడితుందరికి ముక్తిని కలిగింతునని ||2||
పలికి నడచి నడిపిన నజరేయుడా ||2||
రండీ ! పొల్గొందము ` రండీ ! రక్షణ పొందుదము ||2||
రండీ ! రక్షణ పొందుదము llనినుll
2 వ చరణం..
పప పరమప పప పరమప
సహవాస మొనరించు ` బలిపీఠమిదియే
సర్వమానవాళికి సంజీవి శిలువయె
కరుణకు ఈ బలియే కారుణ్య రూపము ||2||
కరము శిరము మచి నిను కొలిచెదము ||2||
రండీ ! పొల్గొందము ` రండీ ! రక్షణ పొందుదము ||2||
రండీ ! రక్షణ పొందుదము llనినుll