Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: పవిత్రాత్మస్వరం
ప. దావీదు కుమార-యేసయ్యా
నను - కరుణించయ్యా
ఒకమాటైన - చాలును దేవా
(నేను) స్వస్థత - పొందెదను ||2||
రావయ్యా యేసురాజా ||2||
స్వస్థత పరచగను - త్వరగరావయ్యా ||2|| ||దా||
1. అంగీ అంచును - అంటగనే
అద్భుత స్వస్థత - నిచ్చావు ||2||
నీ దృఢ విశ్వాసము నిన్ను స్వస్థత పరచెను ||2||
అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా ||2|| ||రా||
2. మరణించిన - లాజరును
జీవముతో - లేపావు ||2||
నేనే పునరుత్థానమును
సత్యం జీవం - మార్గమును ||2||
అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా ||2|| ||రా||