Type Here to Get Search Results !

దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా ( dhuduku chinnavadanu oo yesaiah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా - 

క్షమనుకోరి వచ్చితినయ్యా నా యేసయ్యా 

కరుణించి కావుము దయచూపి బ్రోవుము - 

నీ దీన బిడ్డను క్షమియించి బ్రోవుము


1. మరచితినయ్యా పరిధిలేని నీ ప్రేమను - 

మీరితినయ్యా నీ ప్రేమ పథమును

అంధకార అడవిలో తిరుగాడుచుంటిని ||2|| 

దిక్కుతోచక నేను ఒంటరినైపోతిని ||2|| | ||కరుణించి|| 


2. ఘోరమైన పాపాలు చేశాను దేవా - 

నీ శిలువకు కారకుడిని అయ్యాను నాధా

నీ మంచి మనసును బాధించియుంటిని ||2|| 

నీ నుండి దూరమై వగయుచున్నాను ||2|| | ||కరుణించి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section