Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: దుడుకు చిన్నవాడినై - నిను వీడిపోతిని
జనులంత వెలివేయ - ఏకాకి నైతిని
ఆ తండ్రివోలె నాపై - కరుణ చూపవా దేవా ||దుడుకు||
1. ధనధాన్య సాధనే - ధరలోన సత్యమని
అధికార దాహమే-అన్నింట మిన్నయని ||2||
శారీర సౌఖ్యమే - ఇలలోన గమ్యమనీ
వ్యసనాల బానిసనై - కడు హీనుడైతిని ||దుడుకు||
2. నాకంత తెలుసుననీ - నా మాటే వేదమనీ
విశ్వాస సత్యమునే-ప్రశ్నించి పామరుడైతి ||2||
నా అల్పజ్ఞానమే - గర్వాంధకారమై
ఆ చౌక తర్కమే - అపవాది బోధయై ||దుడుకు||