Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: దయచూపగ రావయ్య దయా సాగరా
కృపజూపుము యేసయ్య కరుణామయుడా
నే పాపిని - నే దోషిని
కరుణించి కాపాడుమా
దీవించి నను బ్రోవుమా
1. ఆదాము పాపమును హరించుటకు
ఏవమ్మ శాపమును తొలగించుటకు
నర రూపు దాల్చిన నజరేయుడా
నా పాప భారము రూపు మాపుము
2. బొంకిన పేతురును క్షమించితివి
శిలువపై దొంగను మన్నించితివి
దీనుల (న్) కాపాడిన దీన బాంధవా
నా పాప భారములు తీసివేయుమా