Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
దయగల దేవుడు కరుణామయుడు
మహిమాన్వితుడు జీవపూర్ణుడు॥2॥
ఆ త్రీత్వ దేవుని పూజులు చేయ...॥2॥
తరలి రారండి దేవుని జనమా...॥2॥ ॥దయగ॥
1.సర్వ సృష్టినీ ప్రేమతో చేసిన దైవం
భూమ్యాకాశములను వెలిగించెను ॥2॥
తన రూపునా మనషిని చేసిన దైవం ॥2॥
మహోన్నత స్థానమును ప్రసాదించెను...॥2॥ ॥దయగ॥
2.నరులను ప్రేమతో దైవం భీక్షించును ॥2॥
పేదల ఆకలి తీర్చి రక్షించును ॥2॥
దీనుల నోదార్చి తృప్తిపరచును ...॥2॥
సకల ప్రజలకు శాంతిని చేకూర్చును...॥2॥ ॥దయగ॥