Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తెలివి నుండు ధర యందు నీవు
ఘనమైన భాగ్యము గలుగు పరమందు
1 వ చరణం..
ఎప్పుడెప్పుడో యనగ నీడ- జీవం
బెప్పుడు పోవునో - యెరుగము జాడ
ఒప్పు నెల్లప్పుడుండు మీడ- నీవు
తప్పు జేసితె యీడ- దండన యాడ llతెలివిll
2 వ చరణం..
అన్నదానము చేయు మీడ- దేవా
కన్నెలు నిను మెచ్చి కరుణింతు రాడ
మున్ను మూర్ఖుడైతే యీడ నిన్ను
మూర్ఖ జవానుల చే మర్ధింతు రాడ llతెలివిll
3 వ చరణం..
పెద్దల మన్నించు మీడ -పెద్ద
గద్దె పై గూర్చుండగా చేతురాడ
బుద్ధిహీనుడైనైతే యీడ నిన్ను
మొద్దనుచు మిగులును -మోదుదురాడ llతెలివిll
4వ చరణం..
పర ద్రవ్యముల గోరికీడ - దొడ్డ
దొర వచ్చెనని దేవదూతల్మెత్తు రాడ
పరదార గోరితివే నీడ -నిన్ను
నరకాగ్నిలో వేసి కరిగింతు రాడ llతెలివిll
5 వ చరణం..
పరోపకారివి కమ్ము -నీవు
పరులు నా వారని - బ్రాంతి పోజిమ్మి
ధర రూఢి గల బోధ నొంది నీవు
పరమేశ్వరుని పాద పంకజము చేరి llతెలివిll