Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
దివిలో దేవుని మహిమ - భువిలో మనుజుల శాంతి ||2||
కలకాం కలగాలని - దూతలతో పాడెదము ||2||
1 వ చరణం..
ఏలినవారైనా సర్వేశ్వరా - పరలోక రారాజా ||2||
అనంతబలమైన పరమపితా-మిమ్ముపోగడుచుయున్నాము ||2||
2 వ చరణం..
జనితైక సుతుడా యేసయ్యా - దేవుని గొఱ్ఱెపిల్లా ||2||
పిత యొక్క పుత్రుడా శ్రీ యేసువా-లోకపాప పరిహారకుడా ||2||
3 వ చరణం..
పితయొక్క ప్రక్కన - మహఘనతతో ఆశీనులైనవారా ||2||
మా నేత్రములను తెరువమని - మిమ్ము వేడుచుయున్నాము ||2||
4 వ చరణం..
పరిశుద్ధులు మీరొక్కరే – మహోన్నతులు మీరొక్కరే ||2||
పితయైన సర్వేశ్వరుని - మహిమలో పరిశుద్ధాత్మతో - నుండువారా ||2|| llదివిll
ఆ... ఆమెన్ ఆ... ఆమెన్ - ఆ... ఆమెన్ ఆ... ఆమెన్