Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివినేలు మహరాజుకే మంగళం
భువినిల సర్వులకు సమాధానము ||2||
1. దేవాది దేవా పరలోక రాజా
దయా సంపన్న ఓశక్తిమంత ||2||
మా స్తుతి మహిమ ఘన ఆరాధన ||2||
అర్పింతుము అనవరతం
పొగడెదము మీ మహా వైభవం
పాడెదము వందన గీతం ||2|| ||ది||
2. నరరూపధారి ఓ క్రీస్తు రాజా
మా మధ్యనున్న ఓ గొఱ్ఱపిల్లా ||2||
పాప లోపములు మన్నించు ప్రభువా
దయతోడ మమ్ము కావుము దేవా
పొగడెదము మీ మహా వైభవం
పాడెదము వందన గీతం ||2|| ||ది||
3. పిత పీఠానికి కుడి ప్రక్కన
అధిరోహించిన ఓ మహరాజా
పిత పవిత్రాత్మలతో సహా
సకలం స్తుతియించెదం
పొగడెదము మీ మహా వైభవం
పాడెదము వందన గీతం ||2|| ||ది||