Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: దివియందు దేవునికి మహిమ....
గ్లోరియా... గ్లోరియా...
భువియందు మనుజులకు శాంతి
గ్లోరియా... గ్లోరియా...
1. సర్వేశ్వరా దేవా సకలసృష్టి కర్త
పరమపావనుడా ..పరలోకరాజా
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా ||2||
మిమ్ము పొగడుచున్నాము ||2||
స్తుతించుచున్నాము ||2||
ఆరాధించుచున్నాము ||2||
మిమ్ముఘనపరచుచున్నాము
2 జనితైకపుత్రుడా..జేసుక్రీస్తువా
పాపులరక్షకా..పాపములన్ పరిహరించు
మాపైదయచూపి-మామొరనాలకించు ||2|| ||ది||
3. దేవాదిదేవుడా..దేవుని ప్రియసుతుడా
తండ్రికుడి ప్రక్కన కూర్చుని యున్నవారా
మీఘన మహిమలో మమ్మును చేర్పుమయా ||2|| ||ది||
4. మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు ఏలినవారు
ఏలినవారు - మీరొక్కరే మహోన్నతులు
తండ్రి మహిమలో ఆత్మతో నుండవా ||2|| ||ది||
ఆమెన్... ఆమెన్... అమెన్...