Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దోషులపై దయచూపు దయామయా
కరుణించి క్షమియించు కరుణామయా
1. ఇజ్రాయేలు ప్రజలను మన్నించలేదా
దావీదు రాజుపై దయచూపలేదా
యోనా ప్రవక్తకు శరణ మియ్యలేదా
కాళ్ళు పట్టి వేడెద కరుణ చూప కోరెద
2.. బొంకిన పేతురును పాపివని విడిచావా
మరియ మగ్దలేనను అపవిత్రగ నుంచావా
ద్వేషించిన పౌలును దోషిగ చూచావా
నేనంత పాపినా నీ దయకు నోచనా