Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దూతలు పాడిరి పరమోన్నత గీతముల్
పరమండలాధీశుని స్తుతియించి కొనియాడిరి ||2||
మహెూన్నత దేవునికి మహిమని పాడుదాం
ఇల భువి జనులందరికి - శాంతి శుభములు అగుననుచు ||2||
శాంతి శుభములు ||4|| అగుననుచు (దూతలు పాడిరి)
1. ఏలికయైన సర్వేశ్వరా మా స్వర్గరారాజా
మహాబలముగల ఓ పితా మమ్మేలు మారాజా ||2||
మీకే స్తుతి మీకే మహిమ ఘన ఆరాధన ||2||
మా స్తుతులన్ని ప్రభు నీకయ్యా - గ్లోరియా ||3|| గ్లో...రియా ||2||
2. జనితైక సుతుడా శ్రీ క్రీస్తువా పాపవిమోచకుడా
సర్వేశ్వరుని ప్రియ గొఱ్ఱపిల్లా రక్షణాధీశుడా ||2||
మీకే స్తుతి మీకే మహిమ ఘన ఆరాధన ||2||
మా స్తుతులన్ని ప్రభు నీకయ్యా - గ్లోరియా ||3|| గ్లో...రియా ||2||
3. పితకుడి పార్శ్వాన ఆశీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా
పితమహిమలో పరిశుద్ధ ఆత్మతో - పాలించు మా ప్రభువా ||2||
మీకే స్తుతి మీకే మహిమ ఘన ఆరాధన ||2||
మా స్తుతులన్ని ప్రభు నీకయ్యా - గ్లోరియా ||31| గ్లో...రియా ||2||