Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివ్యగంధ వేదమూ-వాక్యరూప దైవము ||2||
దినదినము పఠించుము-ఓ సోదరా (సోదరి)
విశ్వసించి అనుసరించు-హృదయ పూర్తిగా
1. సృష్టికంత మూలమూ
ప్రభుని ప్రేమ వాక్యము
ప్రాణికోటి మనుగడకు
మూలము ఈ వాక్యము ||2||
కేవలమూ రొట్టె వలన
మనిషి బ్రతుక జాలడు ||2||
పరమాత్ముని వాక్కువలన
జీవించగలడు ||2|| ||దివ్యగ్రంథ||
2. తన ప్రజలను నడిపించెను
ప్రభుని ప్రేమ వాక్యము
దాస్యమును తొలగించెను
ప్రభుని దివ్య వాక్యము ||2||
విశ్వసించి నమ్ముకొని
ప్రభుని అనుసరించిన ||2||
చేరుకొందురందరూ-పరలోక రాజ్యము ||2||
||దివ్యగ్రంథ||