Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: కరుణ కిరణాలు
ప. దివినుండి దిగిన దివ్వ ఆహారమా
జీవముగల దివ్వ సత్ప్రసాదమా ||2||
మధురమైన వర ప్రసాదమా
శక్తినిచ్చు పరమౌషదమా
స్తుతియించి కీర్తించెద
ఘనపరచి కీర్తించెద
ఆరాధన స్తుతి ఆరాధన ఆ
రాధ్య దైవమా ఆరాధన ఆరాధన
1. దివ్య మందసం నందు రేయింబవళ్ళు
వేచియున్న నా యేసయ్యా-నాకై
వేచియున్న నా యేసయ్యా
అనుదినము నా ఆత్మకు ఆహారమై
రారమ్మని పిలచుచున్న నా యేసయ్య
నన్ను పిలచుచున్న నా యేసయ్య -
యేసయ్యా ఆరాధన ||2||
2. నేను లేక నీవు లేవని నా తోడై
అనుక్షణము నడిపించే నా యేసయ్య
నన్ను నడిపించే నా యేసయ్య
నాలోని సర్వముతో జీవితాంతం
ఎల్లప్పుడు స్తుతియించెద నా యేసయ్య
నిన్ను స్తుతియించెద నా యేసయ్య
యేసయ్య ఆరాధన - యేసయ్య ఆరాధన