Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివ్య ప్రసాదమిదే - లోకొన రారండి
దేహాత్మలకు జీవమిదే చేకొనరారండి
ప్రభు దీవెనలను పొందండి ||2||
1 వ చరణం..
ఆకలిగొనిన దీనులకు -
ఆహార మొసగెను మన ప్రభువు ||2||
అలసి సొలసిన ఆత్మలకు -
ప్రభువే ఆహారము
క్రీస్తు ప్రభు దేహం - క్రీస్తు ప్రభు రక్తం
క్రీస్తు ప్రభు జీవం చేకొన రారండి
ప్రభు యేసుని లోకొనుడీ ||దివ్య ||
2 వ చరణం..
అప్పము ఒకటైనట్లుగనే -
అందరం ఒకటై నిలవాలి ||2||
జపము జీవము జీవితము
పరులకు పంచాలి
క్రీస్తు ప్రభు దేహం - క్రీస్తు ప్రభు రక్తం
క్రీస్తు ప్రభు జీవం చేకొన రారండి
ప్రభు యేసును లోకొనుడీ ||దివ్య ||