Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: జూబిలీ స్వరం
ప. దివ్య సంస్కార రూప
దివ్య సత్ప్రసాద ప్రభువా ||2||
రావా నాహృదిలోనికి
కడరాత్రి ప్రభువా ||2|| ||ది||
1. నేనే ఆహారమన్న దయగల ప్రభువా
నేనే పానీయమన్న - పాపుల రక్ష
రావా నా హృదిలోనికి
కడరాత్రి ప్రభువా ||2|| ||ది||
2 లోకమునకు వెలుగు నిచ్చి జగముల ప్రభువా
అంధత్వము తొలగించే ప్రకాశపుత్రుడా
రావా నా హృదిలోనికి
కడరాత్రి ప్రభువా ||2|| ||ది||
3. ధరణికి నే ఉప్పునన్న దైవ కుమారా
ధర్మ బోధ చేసినట్టి దీనబాంధవా
రావా నా హృదిలోనికి
కడరాత్రి ప్రభువా ||2|| ||ది||
4. పాపరోగ మందు నిచ్చే - పరమ వైద్యుడా
శాపమునకు విడుదలిచ్చే మనుజ కుమారా
రావా నా హృదిలోనికి
కడరాత్రి ప్రభువా ||2|| ||ది||
5. నిన్న నేడు నిరంతరము నీవే యేసువా
ఆది అంత్యములు లేని ఆల్ఫా ఓమేగా
రావా నా హృదిలోనికి
కడరాత్రి ప్రభువా ||2|| ||ది||